Loading

wait a moment

సామాన్యుడి చెంతకు రాజకీయాలు చేరుస్తున్నాం – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

వేల‌కోట్ల‌తో ముడిప‌డిన రాజ‌కీయాల‌ను సామాన్యుడి చెంత‌కు చేర్చ‌డానికి జ‌న‌సేన పార్టీ సామాన్యుల‌కు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింద‌ని  జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు తెలిపారు. ఒక కూలీ కొడుక్కి, ఒక బ‌స్ కండ‌క్ట‌ర్ కుమారుడికి, ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేని ఆడ‌బిడ్డ‌ల‌కు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామ‌ని గుర్తు చేశారు. మిగ‌తా పార్టీల్లా త‌మ బంధువుల‌కు, త‌మ‌వారికి టికెట్లు ఇచ్చుకోలేద‌న్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌తిప‌క్ష‌ నేత జ‌గ‌న్మోహన్ రెడ్డి అంటే వ్య‌క్తిగ‌తంగా శ‌త్రుత్వం లేద‌ని, సామాన్యుడి బ‌తికే భార‌తం కావాల‌ని మాత్ర‌మే కోరుకుంటున్నాన‌ని వెల్ల‌డించారు.

జ‌న‌సేన ఎన్నిక‌ల శంఖారావంలో భాగంగా సోమ‌వారం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. స‌భ‌కి హాజ‌రైన ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు మాట్లాడుతూ… “2006లో అన్న‌వ‌రం సినిమా షూటింగ్ లో ఉంటే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మేన‌మామ, క‌డ‌ప మేయ‌ర్ ర‌వీంద్ర‌నాథరెడ్డి నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి సినిమా చేయాల‌ని ఇబ్బందిపెట్టారు. నాలాంటి వాళ్ల‌ను ఇబ్బంది పెట్ట‌గ‌లిగితే ఇక సామాన్యుల ప‌రిస్థితి ఏంట‌నిపించింది. ఇంతమంది అభిమానులు ఉన్న నాలాంటి వాడు కూడా రాజ‌కీయాల్లోకి రావ‌డానికి భ‌య‌ప‌డితే స‌మాజానికి అన్యాయం చేసిన వాడిని అవుతాన‌ని చెప్పి 2008లో కామ‌న్ మ్యాన్ ప్రొట‌క్ష‌న్ ఫోర్స్ పెట్టాను. దానిని ఎందుకు ముందుకు తీసుకెళ్ల‌లేక‌పోయాను అంటే.. మా అన్న ప్ర‌జారాజ్యం పార్టీ  పెట్టారు. ఆయ‌న మీద ఉన్న అపార‌మైన గౌర‌వం, మ‌ర్యాద‌తో వెన‌క్కి వెళ్లిపోయాను. 

కరప్షన్ఆంధ్రగామార్చేశారు

2014లో తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చేవాడిని కాదు. కానీ ప్ర‌ధాని మంత్రి అభ్య‌ర్ధి మోడీ గారు చంద్ర‌బాబుతో క‌లిసి వెళ్తున్నాం, మీరు కూడా వ‌స్తే బాగుంటుంది అని అడ‌గ‌బ‌ట్టి ఆనాడు తెలుగుదేశానికి మ‌ద్ద‌తు ఇచ్చాను. అప్పుడు ప్ర‌చారంలో భాగంగా మోడీ గారు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం స్కాం ఆంధ్రాగా మారుతుంద‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌డు అలాంటి వ్య‌క్తుల‌తో ఎలా క‌లుస్తారు. నేను కూడా ఆనాడు స్కాం ఆంధ్ర వ‌ద్ద‌ని చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇస్తే ఈయ‌న క‌రెప్ష‌న్ ఆంధ్ర తీసుకొచ్చారు. దొరికిన‌కాడికి ఇసుక‌ను దోచేసి జేబులు నింపుకున్నారు. ఇవ‌న్ని చూసి విసిగి   పోయి ఇవాళ ఒంట‌రిగా పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఒంట‌రిగా పోటీ చేయ‌డం మ‌న ఉనికిని చాటుకోవ‌డం కోసం. గెలుపోట‌ములను కాలం నిర్ణ‌యిస్తుంది. మార్పు రావాల‌ని చిత్త‌శుద్దితో కోరుకుంటే కాల‌మే గెలుపిస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి కావాలో వ‌ద్దో, జ‌న‌సేన ప్ర‌భుత్వం రావాలో లేదా అనేది మ‌రో 40 రోజుల్లో తేలుతుంది. 

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జ‌న‌సేన పార్టీని విమ‌ర్శించ‌వ‌చ్చు. రాజ‌కీయాల్లోకి మూడో వ్య‌క్తిని రావ‌నివ్వ‌రు.  పొలిటిక‌ల్ డీఎన్ఏ ఈ రెండు కుటుంబాల‌కే సొంతం అన్న‌ట్లు మాట్లాడ‌తారు. ప్ర‌జారాజ్యం పార్టీలో కూడా టికెట్లు అమ్ముకున్నామ‌ని త‌ప్పుడు కూత‌లు కూసింది కూడా తెలుగుదేశం పార్టీ,  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పిలవ‌బ‌డే కాంగ్రెస్ పార్టీ నాయ‌కులే. మా ద‌గ్గ‌ర‌ రాజ‌కీయ అనుభ‌వం లేక‌పోవ‌చ్చు కానీ, ల‌క్ష‌ల కోట్లు దోచేసి జైల్లో కూర్చున్నంత నైతిక ప‌త‌నం మాత్రం చెంద‌లేదు. మాకున్న స‌మ‌స్య ఏంటంటే మంచిత‌నం. ఆ మంచిత‌నంతోనే చిరంజీవిగారు ఆ రోజు ఒత్తిడి తీసుకోలేక‌పోయారు. జ‌న‌సేన పార్టీ స్థాపించిన‌ప్పుడు తెలుగుదేశం పార్టీ, వైఎస్ కుమారుడుగా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయాల్లో ఉన్నారు. తెలంగాణ నాయ‌కులు నానా ర‌కాలుగా తిడుతుంటే ఒక్క‌రు కూడా మాట్లాడ‌లేదు. ఎందుకంటే వీరికి హైద‌రాబాద్ లో ఆస్తులు ఉన్నాయి. దాడులు చేస్తార‌ని భ‌యం. ఇవ‌న్ని చూసి విసుగొచ్చి జ‌న‌సేన పార్టీ పెట్టాను. తెలుగు ప్ర‌జ‌ల ఐక్య‌త‌, ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వం కోసం పార్టీ స్థాపించాను.  రాజ‌కీయం వీరిద్ద‌రి ఇళ్ల‌ల్లోనే కాదు ప్ర‌తి సామాన్యుడి ఇంట్లో కూడా ఉంటుంద‌ని చేసి చూపిస్తాను. 

జగన్వెళ్ళిఅమిత్షాకాళ్ళుపట్టుకుంటారు

ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెళ్ళి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని అమిత్ షా కాళ్లు ప‌ట్టుకుంటారు. కేసీఆర్ తిట్టిన తిట్లు మ‌రిచిపోయి ఆయ‌న వేసిన బిస్కెట్ల కోసం వెంప‌ర్లాడుతారు. కేసీఆర్ వ‌స్తే ఇబ్బందిపెడ‌తార‌ని దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారు చెప్పారు. అలాంటి వ్య‌క్తి పేరు మీద పార్టీ పెట్టి ఆయ‌న చెప్పిన దారిలో న‌డ‌వ‌లేక‌పోతున్నారు. ఇదేనా మీ పులివెందుల పౌరుషం..? ఓదార్పు యాత్ర పేరుతో బుగ్గ‌లు, గెడ్డాలు నిమ‌ర‌డం త‌ప్ప మీకు పౌరుషం లేదా..?  తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఆయ‌న కుమారుడు కేటీఆర్ మీకంటే నాకు బాగా తెలుసు. వారికి మ‌ర్యాద ఇస్తాను త‌ప్ప‌, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిలా ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వం తాక‌ట్టుపెట్ట‌ను. ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వం కాపాడ‌లేనివాడు ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఎలా అవుతాడు. చంద్ర‌బాబు నాయుడు గారి మీద కేసీఆర్ గారికి కోపం ఉంటే తాడేప‌ల్లిగూడెంలో అభ్య‌ర్ధిని నిల‌బెట్టి గెలుపించుకొని రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చుకోవాలి త‌ప్ప, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని అడ్డంపెట్టుకొని  ఆంధ్ర‌ రాజ‌కీయాల్లో వేలుపెడ‌తామంటే స‌హించం. 

సైకిల్స్టాండ్వేసితొక్కుకోవాల్సిందే

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే వ్య‌క్తి పేరును ఉచ్చ‌రించ‌డానికి కూడా జ‌గ‌న్మోహన్ రెడ్డి ఇష్ట‌ప‌డ‌టం లేదు. ఎక్క‌డ త‌గ్గిపోతామోన‌న్న భ‌యం. నాకు అలాంటి భ‌యాలు లేవు. తెలుగుదేశం పార్టీ మీద విమ‌ర్శ‌లు చేయ‌డం లేద‌ని వైసీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. 2018 మార్చి 14 జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో తెలుగుదేశం పార్టీ అవినీతిపై మాట్లాడి తొక్క తీసిందే జ‌న‌సేన పార్టీ. టీడీపీ నా దృష్టిలో 2018లోనే ఓడిపోయింది. సైకిల్ చైన్ తెగిపోయింది. స్టాండ్ వేసి తొక్కుకోవాలే త‌ప్ప దాని వ‌ల్ల రాష్ట్రానికి ప్ర‌యోజ‌నం లేదు. జ‌న‌ సైనికుల‌ను, ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్ట‌డానికి తెలుగుదేశం నాయ‌కులు కొంత‌మంది పొత్తుల‌పై త‌ప్పుడు కూత‌లు కూస్తున్నారు. వారికి ఒక‌టే చెబుతున్నాను మీ త‌ప్పుడు కూత‌లు హ‌ద్దులు దాటితే ఎంత గ‌ట్టిగా మాట్లాడాలో నాకు తెలుసు. తోలు తీసే భాష నాకు వ‌చ్చు జాగ్ర‌త్త‌. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవ‌రో పెడితే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెచ్చుకున్నారు. టీడీపీని చంద్ర‌బాబు ఎన్టీఆర్ నుంచి లాక్కున్నారు. ద‌మ్మున్న మ‌గాడిలా పార్టీ పెట్టింది మ‌న‌మే. ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వం, అభ్యున్న‌తి కోసం పార్టీ పెట్టాను.

ఆడపడుచులకుభరోసాగా

జ‌న‌సేన పార్టీ ప్ర‌భుత్వం స్థాపించి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య‌మంత్రి అయితే 60 ఏళ్లు నిండిన ప్ర‌తి రైతుకు రూ. 5 వేలు పింఛ‌న్ వ‌చ్చేలా రైతు పెన్ష‌న్ ప‌థ‌కంపై తొలి సంత‌కం పెడ‌తాను. అలాగే రూ. 8వేలు సాగుసాయం అందిస్తాం. కుటుంబ స‌భ్యుల సంఖ్య ఆధారంగా, ఆదాయంతో సంబంధం లేకుండా ఆడ‌ప‌డుచుల‌కు ఉచిత గ్యాస్ అందించే  ప‌థ‌కం మీద రెండో సంత‌కం చేస్తాం. ఏడాదికి ఆరు నుంచి ప‌ది సిలిండ‌ర్లు ఉచితంగా జ‌న‌సేన ప్ర‌భుత్వం అంద‌చేస్తుంది. త‌దుప‌రి సంత‌కం రేష‌న్ బియ్యం, ప‌నికిరాని పామాయిల్‌తో ఇబ్బందులు ప‌డుతున్న మీ కోసం రేష‌న్‌కి బ‌దులు రూ. 2500 నుంచి రూ. 3500 వంద‌లు మ‌హిళ‌ల ఖాతాల‌కి జ‌మ చేసే ప‌థ‌కంపై పెడ‌తాను.  ఆడ బిడ్డ‌ ప్ర‌తి ఇంటికి మ‌హాల‌క్ష్మీ అని, అటువంటి మ‌హాల‌క్ష్ముల‌ వివాహానికి “మా ఇంటి మ‌హాల‌క్ష్మీ” ప‌థ‌కం కింద ల‌క్ష రూపాయ‌లు అందిస్తాం, అలాగే “పుట్టింటి సారె” కింద ప‌దివేలనూట‌ప‌ద‌హార్లు ఇస్తాం. మాజీ సైనికుల ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి మండ‌లంలో 10 ఎక‌రాల్లో దేశ‌భ‌క్తి ప్రాంగ‌ణాలు ఏర్పాటు చేస్తాం. దేశ‌భ‌క్తి పెంపొందించే కార్య‌క్ర‌మాలు, శారీరక‌ దారుఢ్యం కోసం వ్యాయామశాల‌లు, యువ‌త వికాసం కోసం యుద్ధ విద్య‌లు నేరిస్తాం. 3 ల‌క్ష‌ల బ్యాక్ లాగ్ పోస్టుల‌ను ఆరు నెల‌ల్లో భ‌ర్తీ చేస్తాం. పోలీస్ శాఖ‌లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డంతో పాటు బ‌ల‌మైన ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ కోసం 25వేల మందితో స్పెష‌ల్ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ జారీ చేస్తాం. పోలీస్ కానిస్టేబుల్స్ కు ఒక రోజు సెల‌వుదినంతో పాటు నివాస‌యోగ్య‌మైన బ‌హుళ అంతస్తులు నిర్మిస్తాం. విద్య‌, వైద్యం ఉచితంగా అందిస్తాం. పోటీ ప‌రీక్ష‌లకు ప్రీపేర్ అయ్యే విద్యార్ధులు సంవ‌త్స‌రానికి ఒక్క‌సారి ఫీజు కట్టే విధానాన్ని తీసుకొస్తాం. ఇంట‌ర్ చ‌దువుతున్న విద్యార్ధుల‌కు ఉచిత ల్యాప్ టాప్ అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. జ‌న‌సేన పార్టీ మార్పుకోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది. తాడేప‌ల్లిగూడెం అసెంబ్లీ స్థానం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కొణిదల నాగేంద్రబాబు గారిని అభ్యర్థులుగా నిలిపాం.  గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి వీరిద్ద‌రిని అఖండ మెజార్టీతో గెలిపించాల‌”ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *