Loading

wait a moment

మహిళల టీ20 చాలెంజ్ ఫైనల్.. మిథాలీరాజ్‌ vs హర్మన్‌ప్రీత్‌కౌర్‌

హైదరాబాద్ వేదికగా ఆదివారం రాత్రి పురుషుల ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. మరోవైపు ఐపీఎల్‌ మహిళల టోర్నీకి సన్నాహకంగా జరుగుతున్న టీ20 చాలెంజ్ టోర్నీ కూడా చివరి అంకానికి చేరింది. జైపూర్ వేదికగా శనివారం రాత్రి మిథాలీ రాజ్‌ సారథ్యంలోని వెలాసిటీ.. హర్మన్‌ప్రీత్‌కౌర్‌ సారథ్యంలోని సూపర్‌ నోవాస్‌ జట్లు తలపడనున్నాయి.

షెఫాలీ వర్మపై ఆశలు:
వెలాసిటీ జట్టులో యువ సంచలనం షెఫాలీ వర్మ ఆకట్టుకుంటుంది. ఫైనల్లో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడితే వెలాసిటీకి భారీ స్కోరు ఖాయం. టాపార్డర్‌లో హయెలీ మాథ్యూస్, షెఫాలీ వర్మ.. మిడిల్‌ ఆర్డర్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్, వేదా కృష్ణమూర్తి, డానియెల్లీ వ్యాట్, అమిలీయా కెర్ లాంటి స్టార్ ఆటగాళ్లతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగానే ఉంది. మిథాలీ పరుగులు చేస్తున్నా.. వేగంగా ఆడలేకపోతుంది. మిథాలీ వేగం అందుకుంటే సూపర్‌నోవాస్ జట్టుకు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్‌లో కూడా శిఖా పాండే, ఏక్తా బిస్త్, కోమల్ జంజద్, దేవికా వైద్యలు ఉన్నారు. సమిష్టిగా రాణిస్తే విజయం సులువే.

రోడ్రిగ్స్ సూపర్ ఫామ్:
సూపర్ నోవాస్ జట్టులో జెమీమా రోడ్రిగ్స్ సూపర్ ఫామ్ లో ఉంది. ఇన్నింగ్స్ ఆరంభంలో బౌండరీల మోత మోగిస్తూ మంచి ఆరంభం ఇస్తుంది. ఇదే జోరు ఫైనల్లో కూడా కొనసాగించాలని నోవాస్‌ కోరుకుంటుంది. రోడ్రిగ్స్‌కు తోడు సోఫీ డివైన్, హర్మన్‌ప్రీత్‌కౌర్, స్కీవర్ లు కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్‌లో పూనమ్‌ యాదవ్‌, డెవిన్‌, అనుజ పాటిల్‌ అండగా నిలుస్తున్నారు. లీగ్‌ దశను చూసుకుంటే.. ఈ మ్యాచ్ హోరాహోరీ సాగేలా కనిపిస్తోంది.

ట్రయల్‌ బ్లేజర్స్‌ ఔట్:
ఈ టోర్నీలో పాల్గొన్న మూడు జట్లు ట్రయ ల్‌ బ్లేజర్స్, వెలాసిటీ, సూపర్‌ నోవాస్‌లు లీగ్‌ దశలో ఒక్కో మ్యాచ్‌ గెలిచి.. ఒక్కో మ్యాచ్ ఓడాయి. అన్ని జట్లు రెండు పాయింట్లతో సమంగా నిలిచినా.. నెట్‌ రన్‌రేట్‌ తక్కువగా ఉండడంతో స్మృతి మంధాన కెప్టెన్సీలోని ట్రయల్‌ బ్లేజర్స్‌ ఫైనల్‌కు అర్హత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *