Loading

wait a moment

షాకింగ్… జనసేన పవన్ కల్యాణ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా

నిబంధనల ప్రకారం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు రూ. 28 లక్షలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులకు రూ. 70 లక్షల వరకు వ్యయ పరిమితి ఉంది. కానీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చూపిస్తున్న లెక్కలు చూసి అధికారులు అవాక్కవుతున్నారు.

ఏపీలో ఈసారి ధన ప్రవాహం ఏరులై పారింది.దేశంలోనే అత్యంత నగదు సీజ్ చేసిన రాష్ట్రాల్లో ఏపీ మూడవ స్థానంలో నిలిచింది. దీని బట్టి చూస్తే… ఏపీలో ఈసారి ఎన్నికల నిర్వహణకు నేతలు భారీగానే డబ్బులు ఖర్చు చేశారు. దీనిపై ఇటీవల కాలంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్క అభ్యర్థి రూ.25కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఏపీలో ఎన్నికల ఖర్చు పదివేల కోట్లు అంటూ జేసీ వ్యాఖ్యలు చేశారు. దాదాపు అన్ని ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చూపిస్తున్న ఎన్నికల ఖర్చు మాత్రం అందర్నీ షాక్‌కు గురిచేస్తున్నాయి. నిబంధనల ప్రకారం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులకు రూ. 28 లక్షలు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులకు రూ. 70 లక్షల వరకు వ్యయ పరిమితి ఉంది. కానీ మన అభ్యర్థులు ఆ మొత్తంలో పాపం సగం కూడా ఖర్చు చేయలేదని లెక్కలు చూపిస్తున్నారు. దీంతో వీరు సమర్పించిన లెక్కలు చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాజువాకతో పాటు భీమవరం అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగారు. అయితే ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాకలో చేసిన ఎన్నికల ఖర్చు రూ. 8,39,790 ఖర్చు చేసినట్టు చూపించారు. టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు రూ. 23,19,325 ఖర్చు చేశారు. టీడీపీ నేత సబ్బం హరి రూ. 11,18,617 ఖర్చుగా చూపించారు. వైసీపీకి చెందిన నాయకుడు గుడివాడ అమర్ రూ. 12,60,554 ఖర్చు చేశారు. విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి కేకే రాజు కేవలం రూ. 2,43,711 మాత్రమే ఖర్చు చేసినట్టు చూపించారు. దీంతో ఈ లెక్కలు చూసిన అధికారులు వీళ్లు చేసిన ఎన్నికల ఖర్చు ఇంతేనా అంటూ ముక్కున వేలేసుకుంటున్నార

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *